Wednesday, June 18, 2025

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

- Advertisement -

జూలై 4న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల

Vijay Deverakonda's 'Kingdom' to release on July 4th

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం, జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
“మా ప్రియమైన ప్రేక్షకులకు,
మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్‌’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నిర్ణయం ‘కింగ్‌డమ్’కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా ‘కింగ్‌డమ్‌’ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.” అని చిత్ర బృందం పేర్కొంది.
విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.
ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి, జూలై 4న ‘కింగ్‌డమ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది.
చిత్రం: కింగ్‌డమ్
విడుదల తేదీ: జూలై 4, 2025
తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్