- Advertisement -
కుప్పంలో భువనేశ్వరి పర్యటన
చిత్తూరు
చిత్తూరు జిల్లా, కుప్పం పర్యటన నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు విమానాశ్రయానికి తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు.
విమానాశ్రయం వద్ద ఆమెకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా పార్టీ అధ్యక్షులు పులి వర్తి నాని, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా విమానాశ్రయం నుండి కుప్పం బయలుదేరారు. మంగళవారం కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించి మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. తరువాత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేసారు.
- Advertisement -