
ప్రతి ఇంటికి సంక్షేమ అందిస్తుంది సీఎం కేసీఆర్
భవిష్యత్ తరాలు బాగుండాలంటే కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలి
మరోసారి ఆశీర్వధిస్తే మరింత అభివృద్ధి చేస్తా
తాండూర్: కారు గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లిఎమ్మెల్యేఅభ్యర్థి దుర్గం చిన్నయ్య కోరారు.తాండూర్ మండలంలోని బోయపల్లి అంకుశం చౌటపల్లి త్రీ ఇంక్లైన్ నర్సాపూర్ బెజ్జాల గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. కేవలం ఎన్నికలకు ముందు డబ్బు సంచులతో వచ్చి పోటీ చేసేవారు కావలెనొ, స్థానికంగా ఉండి అభివృద్ధి చేసే తాను కావాలెనొ, అని ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. గతంలోచెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ నుఅక్కడి ప్రజలు నాలుగుసార్లు ఓడించారని, ఇప్పుడు బెల్లంపల్లి కి డబ్బు సంచులతో వచ్చి పోటీ చేస్తున్నాడని అన్నారు. వినోద్ కు కోట్ల డబ్బులు ఉండవచ్చాని,నాకు నియోజకవర్గ ప్రజలు ఉన్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అభివృద్ధి పనులు చేయడంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సంబంధం లేని ప్రజల మధ్యలో ఉండని వ్యక్తి ఎన్నికలు వస్తేనే హైదరాబాద్ నుండి డబ్బు సంచులతో వచ్చి అక్కడక్కడ నోట్ల కట్టలతో తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. చెన్నూర్ 4 సార్లు పోటీచేస్తే ఒక సారి గెలిచి మంత్రి ఆయన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తాను కావాలా, ఎన్నికలు వస్తేనే ప్రజలను మాయమాటలతో మోసం చేసే అద్దె ఇంటి లాంటి ఆయన కావాలా ప్రజలు ఆలోచించాలని కోరారు.
బీఆరెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని
తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ప్రజలను అభ్యర్తించారు. ఎంపిపి ప్రణయ్ కుమార్, జెడ్పిటిసి బాణయ్య, ఎంపిటిసి బుగ్గ ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి, సర్పంచులు బీమా సునీత, చీమల శంకర్, రాజమోగిలి, గాజుల సుజాత, ఉప సర్పంచులు రౌతు వెంకటేశం,కొత్తపల్లి బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తాండూరి బాపూరావు,రామగోని మహిధర్ గౌడ్, మాసాడి నారాయణ, రుకుం తిరుపతి, రఘు, భాస్కర్ గౌడ్, రుకుం సంతోష్, మామిడాల రాజేశం,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



