- Advertisement -
పోలీస్ క్రీడల్లో రాణించిన డబ్ల్యూ.పిసిలు.అభినందించిన రామగుండం సిపి.
W. PCs who excelled in police sports. Appreciated Ramagundam CP.
కమాన్ పూర్
మూడవ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ మహిళ పోలీసులు రాణించారు. ఇందులో కూరపాటి శ్రీలత కబడ్డీ తోపాటు యోగాలో రాణించి సిల్వర్ మెడల్ అవార్డులను అందుకుంది. ఈమెతో ఎలుకపల్లి జాహ్నవి జిమ్నాస్టిక్ లో వాల్టింగ్ టేబుల్ లో కాంస్య పథకం అందుకుంది. ఇటీవల కాలేశ్వరం జోన్ రామగుండం కమీషనరేట్ పరిధిలో జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు కూరపాటి శ్రీలత క్యాప్టెన్సీ వహించారు. కబడ్డీలో రాణించి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లారు. అలాగే యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకొని మన్ననలను పొందారు. అలాగే ఎలకపల్లి జాహ్నవి జిమ్నాస్టిక్ వాల్టింగ్ టేబుల్ రాష్ట్ర స్థాయిలో రాణించి కౌశ్యపంధకాన్ని అందుకున్నారు. వీరిని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గోదావరిఖని ఏసిపి మడత రమేష్, గోదావరిఖని టూ టౌన్ సిఐ నక్క ప్రసాదరావు కమాన్ పూర్ ఎస్సైలు కొట్టే ప్రసాద్ రవళి తో పాటు ఏఎస్ఐలు బాలాజీ నాయక్ రహీం ఖలీల్ ఖాన్ సిబ్బంది బాపన్న బాలు అభినందించారు.
- Advertisement -