బతుకు తెలంగాణ కావాలె బార్ల తెలంగాణ వద్దు :మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

- Advertisement -

బతుకు తెలంగాణ కావాలె

బార్ల తెలంగాణ వద్దు

:మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే:

సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని బార్ల తెలంగాణగా మార్చారని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ప్రచార కార్యక్రమ ఆరుట్ల గ్రామంలో జరిగింది. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ బార్ల తెలంగాణ చేశారని విమర్శించారు. కేసీఆర్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని, కేసీఆర్ ఉన్నా, పోయినా పథకాలు ఎక్కడికి పోవని ఇంతకన్నా అద్భుత పథకాలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తామే ప్రవేశపెట్టుకుంటామని తెలిపారు. విద్య, వైద్యాన్ని మోడీ సర్కారు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కావాలని విద్యను వ్యాపారం చేస్తూ పేదల కడుపు కొడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మోడీ లాంటి సమర్ధవంతమైన నాయకున్ని చూసి ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని అన్నారు. అటువంటి నేతకు మనం రాష్ట్రంలో బిజెపి పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ని గెలిపించుకుంటేనే ఇబ్రహీంపట్నం బాగుపడుతుందని అన్నారు. బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular