- Advertisement -
చెంచుల జీవన స్థితిగతులను మారుస్తాం
We will change the living conditions of Chenchula
నాగర్ కర్నూలు
అడవులను రక్షిస్తూ నే అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న చెంచుల జీవన స్థితిగతులను మార్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, శ్రీ శివు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అడవి ప్రాంతంలో నీ చెంచులకు సిపిఎం ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరితగతిన అంతరించిపోతున్న ఆదిమ జాతి చెంచు బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. అడవులను రక్షించడంతోపాటు అడవిని నమ్ముకుని జీవిస్తున్న చెంచులకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమ్రాబాద్ నల్లమల్ల ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను టూరిజం హబ్ లోకి తీసుకువెళ్లి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక చెంచు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. మల్లెల తీర్థం పర్యాటక ప్రాంతాన్ని ఆమె సందర్శించారు. నల్లమల్ల కు వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఆదివాసి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు..
- Advertisement -


