Sunday, September 8, 2024

త్వరలో సీతరామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మాజీ ఎమ్మెల్సీలు

- Advertisement -

ఖమ్మం: కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారు హుందాతనం మరిచి మాట్లాడుతున్నారు. వారు గెలుపు ఓటములు పక్కన పెట్టి, ఉద్వేగానికి గురి కాకుండా మాట్లాడాలని అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లడుతూ ప్రజా తీర్పు ఏకపక్షంగా ఇచ్చారు, అందుకు కృతజ్ఞతగా ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటున్న సీతా రామ ప్రాజెక్ట్ ను త్వరలో పూర్తి చేస్తాం. మంత్రి వర్గంలో ముగ్గురు అనుభవం కలిగిన వ్యక్తులు ఉండటం శుభ సూచకం. బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. బీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఎన్నికల ఫ్రస్ట్రేషన్ పోలేదు

 

బీఆర్ఎస్ నుండి నాయకులు, కార్యకర్తలు పార్టీ మారే యోచనలో ఉంటే వారిని తమ వైపు తిప్పుకునేందుకు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. మొదటి సారి భారత దేశంలో చిన్న విమర్శ లేకుండా ముఖ్యమంత్రిని కేటాయించడం. కేంద్ర, రాష్ట్ర నాయకులు ఒక తాటి మీదకు వచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి విధానం ఉంటుంది, దాని రూపకల్పన చేసిన తర్వాత రైతు భరోసా అమలు చేస్తాం మీరు చెప్పినట్లు ప్రభుత్వం చేయదని అన్నారు.

ప్రజలు కోరినట్లుగా ప్రభుత్వ విది విధానాలు ఉంటాయి, మీరు చెప్పినట్లుగా చేయం. పొన్నాల లక్ష్మయ్య అంటే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఆయన దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. మీరు అధికారంలో ఉన్న 9 ఏళ్లలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా లేదు గా మరేందుకు కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేద్దాం అని చూస్తే ప్రజల్లో మీ మీద నమ్మకం కోల్పోయి స్థానిక ఎన్నికల్లో చుక్కెదురవుతుందని అన్నారు.

రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014 లో మీకు వచ్చింది 64 సీట్లు మాత్రమే. 10 యేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రజల మన్ననలు పొంది కచ్చితంగా 10 యేళ్లు అధికారంలో ఉండటం ఖాయం. 60 లక్షల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేసి సంతోష పడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు ఉచిత బస్ ప్రయాణంతో సంతోషిస్తున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు అన్ని శాఖలు పరిశీలించి మీ అవినీతి బయట పెడతారని అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సంక్షేమ రాజ్యం తీసుకుని వచ్చేందుకుపేదలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పిల్లి శాపనార్థాలు పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మీద శాపాలు పెడుతుంది. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసినప్పుడే మీ దుర్మార్గపు ఆలోచన అర్థమవుతుంది. మీకు తగిన బుద్ది, శాస్తి ప్రజలు చెప్పారు అయిన మీకు బుద్ది రావడం లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నాటి నుండి శాపాలు పెట్టడం బీఆర్ఎస్ వంతైంది. మీ విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్