మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కమాన్ పూర్: కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ శివారులో గల బండల వాగు పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోరి గుండారం రిజర్వాయర్ లోకి ఎల్లంపల్లి టు టిఎంసి సాగు నీరు వచ్చేలా చేయడం జరిగిందని అన్నారు. అలాగే చాలా గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. రాజాపూర్ గ్రామంలో మిగిలిపోయిన సిసి రోడ్లను పూర్తి చేయించే బాధ్యత నాదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే బీదలకు మహిళలకు రైతులకు నిరుద్యోగులకు కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు గుండారం గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్ నాయకులు సయ్యద్ అన్వర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎం ఏ రఫీక్ పిడుగు నరసయ్య పిడుగు స్వామి జంగిలి కనకయ్య ఆకుల రాజయ్య గుండా నరసయ్య బొంపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.