కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేసి తీరుతుంది
రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తాం
ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
శనివారం మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలములోని మర్రిపెల్లి ప్రతపగిరి , బొప్పరం,శ్రీనివాసపల్లి,ధంతలపల్లి గ్రామలలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన చిన్న కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామన్నారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. మహిళలకు నెలకు రూ.2500, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రాగానే సన్న బియ్యం, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రైతు భరోసాగా 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఏకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్, గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, యువ వికాసం క్రింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో
తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధులకు వితంతులకు 4000 నెలవారీ పింఛన్,10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ప్రతినెల 4 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందని అన్నారు. రైతులకు మెరుగైన కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉంది అని, రైతులకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వమే అందించిందనీ అన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.