బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసారు
42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్ అక్టోబర్ 9
We will give 42% reservation to BCs, there is no question of going back on that: Minister Vakiti Srihari
బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసారు,బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో….యావత్తూ తెలంగాణ ఆలోచన చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపారికల్ డేటా చేపట్టడం జరిగింది ఎంపారికల్ డేటా ఉన్నా స్టే విధించి బీసీల నోటికాడ ముద్ద లాగే ప్రయత్నం చేయడం శోషనీయం42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదుప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నాం…కట్టుబడి ఉంటాంరాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచన చేస్తాంబీసీ బిడ్డలు ఎవరు అధైర్యపడొద్దన్నారు.బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందిబిజెపి,బిఆర్ఎస్ బిసి రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్ అవ్వాలి….లేకపోతే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు


