బాధిత రైతులను ఆదుకుంటాం!
వారం రోజుల్లో గండి పూడ్చి సాగునీరు అందిస్తాం!
ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు పరిహారం అందిస్తాం!
పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాధ ఉత్తం కుమార్ రెడ్డి.
ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.
సూర్యాపేట /నడిగూడెం: సెప్టెంబర్ 2 (వాయిస్ టుడే ప్రతినిధి). .
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత రైతులను ఆదుకుంటామని , హుజూర్నగర్ ఎమ్మెల్యే , పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి,కెప్టెన్ నల్లమాధ ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా,నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం వద్ద ఎడమ ప్రధాన కాలువ కు,పడిన గండి ప్రాంతాన్ని ఆయన , స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మాట్లాడుతూ సాగర్ కాలువకు గండి పడి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయినందున , అధికారులు అంచనా ప్రకారం 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని , ముఖ్యమంత్రి తో మాట్లాడి రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని , వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చి యధావిధిగా పంట పొలాలకు
సాగునీరు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,ఎస్పీ, ఎన్ఎస్పి అధికారులు , నడిగూడెం తాసిల్దార్ సరిత, ఎంపీడీవో హెచ్డి. ఇ మామ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచులు లింగారెడ్డి , అంతి రెడ్డి ,వెంకటరెడ్డి , దేవ బత్తినిరమేష్ బాబు, మాజీ ఎంపీపీ జ్యోతి మధుబాబు, మాజీ జడ్పిటిసి సభ్యురాలు బాణాల కవిత నాగరాజు, స్థానిక ఎస్సై పి అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.