నాకు అన్యాయం జరిగింది రేఖా నాయక్
హైదరాబాద్, ఆగస్టు 22: బీఆర్‌ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అభ్యర్థుల ప్రకటిస్తూ తాను కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కేసీఆర్.. ఇదే సమయంలో.. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో కేటీఆర్ మిత్రుడు భూక్య జాన్సన్‌కు అవకాశం ఇచ్చింది బీఆర్‌ఎస్ అధిష్టానం. దీంతో.. రేఖానాయక్ బీఆర్‌ఎస్ గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తు వచ్చాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రేఖానాయక్ మాట్లాడుతూ.. నాకు అన్యాయం జరిగిందని, నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదనన్నారు. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. రాత్రి పగలు అని చూడకుండా ప్రజల్లో ఉన్నానన్నారు. మూడో సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అని ఇలా చేసారని, మహిళ గా పక్కకు జరపడం భాద గా ఉందన్నారు. పార్టీ కోసం ఎంతో పని చేశానని, ఆరు నెలల్లో ఏ సర్వే లో ఆయన కు ఎం వచ్చిందో ఎమో నాకు తెలియదన్నారు. జాన్సన్ నాయక్ ఏం ఉద్ధరించాడో నాకు తెలియదని, నేను చేయనిది ఏంటి జాన్సన్ నాయక్ చేసింది ఏంటని ఆమె ప్రశ్నించారు. నేను పార్టీని అడుగుతానని, ట్రైబల్ మహిళను పక్కకు జరపడం బాధగా ఉందని రేఖా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను పోటీ లో ఉంటా.. ప్రజల్లో ఉంటానని, నా గొంతు ను తడి గుడ్డ తో కోశారని ఆమె అన్నారు. నా గొంతు లేస్తదని, ఎమ్మెల్యే పదవి ఉండే వరకు పార్టీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తరవాత ఆలోచిస్తానని, కరోనా వచ్చినా తెల్లారే ప్రజల్లోకి వచ్చానని, కడెం డ్యాం ప్రమాదంలో ఉంటే నేను అక్కడికి వెళ్ళానని, ఆరు నెలలు నుంచి ఫండ్ ఇవ్వకుండా నామీద మాట రావాలని అభివృద్ధి చేయలేదన్నారు.నిధులు ఇవ్వలేదు రోడ్లకు నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండా నేనేం చేయలేనని ప్రజలకు తెలుసు. మెట్ పల్లిలో వాళ్ల ఇంట్లో చర్చి ఉంది.. ఆయన తండ్రి చర్చి ఫాస్టర్ ,ఎస్టీ కాని వ్యక్తికి ఎలా ఎస్టీ రిజర్వు నియోజకవర్గంలో ఆయనకు ఎలా టికెట్ ఇస్తారు… వాళ్ల ఫోర్ ఫాదర్స్ కన్వర్టెడ్ క్రిష్టియన్ ,ఫేక్ సర్ఠిఫికెట్ తెచ్చి ఎస్టీ అంటున్నారు..జాన్సన్ నాయక్ పై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపణ. ఆధారాలతో నిరూపిస్తా…నేను పోటీ లో ఉంటా..నేనే గెలుస్తా.’ అని రేఖానాయక్ అన్నారు.