రేవంత్ సీరియస్ కు కారణం ఏమిటీ
హైదరాబాద్, మార్చి 14, (వాయిస్ టుడే )
What is the reason for Revanth's seriousness?
తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల తీరే వేరు. సీఎం రేవంత్ వ్యవహారం వేరు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనుక ఏదో ఉంటుందని హస్తం పార్టీలోనే చర్చ ఉంటుంది. ఇప్పుడు సీఎల్పీ భేటీలో సీఎం చేసిన కామెంట్స్‌పై కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి డిస్కషనే జరుగుతోందట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో మీటింగ్‌లో ఉన్నవారంతా అవాక్కయ్యారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే పట్టనట్లుగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ప్రతిపక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడమేంటంటూ నిలదీశారట. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై పోటీ పెట్టరని భావిస్తున్నారా..? అంటూ గుస్సా అయ్యారట. ఆల్ ఆఫ్ సడన్‌గా సీఎం ఈ స్థాయిలో కామెంట్స్ చేసేసరికి.. సీఎల్పీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారట.ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్వయంగా కేసీఆర్ దగ్గరకి వెళ్లి మరీ కుశల ప్రశ్నలు వేశారట. పనిలో పనిగా కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారట.అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా విడిగా కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారట. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాలని కేసీఆర్‌కు ఇన్విటేషన్ ఇచ్చారు. సభలో కేసీఆర్‌తో ఎమ్మెల్యేలు, మంత్రులు మర్యాదపూర్వకంగా మాట్లాడటం చూసిన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్‌తో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించకుండా ఇన్‌డైరెక్టుగా వరుస పెట్టి గుంపులో గోవిందం అన్నట్లుగా అందరికీ చురకలంటించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రవీంద్ర భారతిలో జాబ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ఫ్రస్టేషన్‌లో భాగమేనంటోంది బీఆర్ఎస్.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా… మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట. హస్తం గూటికి చేరిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఈ మధ్య రివర్స్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే కోనప్ప లాంటి వాళ్లు సైతం బహిరంగంగానే కాంగ్రెస్ ను విమర్శిస్తూ… కేసీఆర్‌ను పొగుడుతుండటం లాంటి పరిస్థితులు కూడా సీఎంకు చికాకు తెప్పిస్తున్నాయట.మరోవైపు బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను సైతం నేతలెవరూ సరిగ్గా తిప్పికొట్టకుండా… ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కూడా సీఎం రేవంత్‌కు చిరాకు తెప్పించిదంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్‌ను పలకరించడం కూడా ఆయనకు పుండు మీద కారం చల్లినట్లు అయిందట. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలందరినీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారట రేవంత్.సీఎల్పీ మీటింగ్‌లో సీఎం చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తుంటే.. కేసీఆర్ స్ట్రేచర్‌ను చూసి రేవంత్ ఫ్రస్టేట్ అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇలా పార్టీ ఎల్పీ మీటింగ్‌లో రేవంత్ చేసిన కామెంట్స్ అటు కాంగ్రెస్‌లో..ఇటు అపోజిషన్ బీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.