Monday, March 30, 2026

వైట్‌నర్‌ వాడిన ఓఎమ్మార్‌ షీట్లు కూడా అనుమతిస్తాం

- Advertisement -

అధికారుల తప్పిదాలు …  నిరుద్యోగులకు శాపాలు

ఒక పేపర్ బదులు మరో పేపర్

టెట్ పరీక్షలో వింతలె

కరీంనగర్, సెప్టెంబర్ 16:   టెట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక పేపర్‎కు బదులు మరో పేపర్ ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని పలు పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్ పరీక్ష కేంద్రాలలో సైన్స్ పేపర్‎కు బదులు ఎన్విరాన్మెంట్ పేపర్‎ను అభ్యర్థులకు ఇన్విజిలేటర్లు ఇచ్చారు. అప్పటికే అభ్యర్థులు 40 ప్రశ్నలకు సమాధానం దిద్దిన క్రమంలో సుమారు నలభై నిమిషాల తర్వాత పేపరు మారిందని జిల్లా గుర్తించిన అధికారులు అభ్యర్థులకు మ్యాథ్య్, సైన్స్ పేపర్ ఇచ్చారు. దాంతో అభ్యర్థులు ఆందోళన చేయగా ఓఎంఆర్ షీట్‎పై వైట్నర్ తో రబ్ చేసి పరీక్ష రాయాలని అధికారులు అభ్యర్థులకు చెప్పారు. ప్రశ్నించిన కొందరు అభ్యర్థులను పరీక్ష హాల్ బయట పరీక్షలు రాయించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.జిల్లాలో టెట్ నిర్వహణలో తలెత్తిన సమస్యపై విద్యాధికారి రమేశ్ కుమార్ స్పందించారు. ప్రశ్నాపత్రాలు మారిన మాట వాస్తవమని, ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు రాసిన వాటిని సరిచేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఓఎంఆర్ షీట్లో వైట్నర్ ఉపయోగించేలా అనుమతిని ఇవ్వడం జరిగిందనీ అభ్యర్థులు వైట్నర్ వాడడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు రాసిన జవాబు పత్రాలను ఆన్లైన్‌లో పెడుతామని, అప్పుడు రాసిన జవాబులకు ఇచ్చిన మార్కులను అభ్యర్థులు చూసేందుకు వీలుంటుందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే అన్ని విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు. అన్యాయం జరిగితే అధికారులే బాధ్యులు అవుతారని టెట్ నిర్వహణలో తీసుకున్న తాత్కాలిక ఉపశమన మార్గాలతో ఎవరికీ అన్యాయం జరగకూడదని విపక్ష నేతలు చెబుతున్నారు. అనంతరం డీఈఓ‎కు జరిగిన తప్పిదాలను టెట్ అభ్యర్థులు లిఖితపూర్వకంగా రాసి వినతి పత్రం సమర్పించారు.

టెట్ అభ్యర్థులు కలెక్టరేట్ చేరుకుని డీఈవో రమేశ్‎తో మాట్లాడారు. అధికారులు తప్పిదాలు చేసిన విషయం వాస్తవం అయినప్పుడు అలాంటి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పడికే పోలీసులు నిర్బంధించడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో అభ్యర్థులు అధికారులు సూచించినట్లు పరీక్ష రాసి వచ్చారు. అన్ని పరీక్ష కేంద్రాలలో టెట్ పరీక్ష ఐదు గంటలకే ముగిస్తే పరీక్ష మారిన కేంద్రాల్లో మాత్రం ఆరు గంటల వరకు నిర్వహించారు. పరీక్ష రాసిన తరువాత అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద నిరసనకుదిగారు. వాస్తవానికి పరీక్షా కేంద్రం వద్ద ధర్నా చేసిన అఖిల పక్షం నాయకులు. ఓఎంఆర్ షీట్‎పై వైట్నర్ తో దిద్దితే కంప్యూటర్ గుర్తించదని తీవ్రంగా ఆందోళన చేశారు. పరీక్ష కేంద్రాల వద్దకు అఖిలపక్ష, వామపక్ష నాయకులు చేరుకొని పరీక్ష కేంద్రాల ముందు బైఠాయించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

27న టెట్ ఫలితాలు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్‌-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో కఠినంగా వచ్చే పేపర్‌-1 ప్రశ్నపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్‌-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. టెట్ పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ ప్రకటించనున్నారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్‌ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు కొన్నిచోట్ల ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌.. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఓఎమ్మార్‌ను పంపిణీ చేయడం, ఆ తర్వాత తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్‌నర్‌తో చెరిపివేశారు. వైట్‌నర్‌ వాడిన ఓఎమ్మార్‌ షీట్లు చెల్లుబాటవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్