16.1 C
New York
Wednesday, May 29, 2024

ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు…

- Advertisement -

ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు…
మైండ్ గేమేనా..
హైదరాబాద్, ఏప్రిల్ 25
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ… అధికార కాంగ్రెస్‌ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తులు హస్తం పార్టీని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. ఒకవైపు రేవంత్‌ సర్కార్‌ పడిపోతుందని ఇప్పటికే రెండు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వీటిని సీఎం ఖండించకపోవడంతో విపక్షాలు అధికార పార్టీపై మరింత దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తాజా ఎన్నికలు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నట్లుగా మార్చేస్తున్నారు.ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షానికి పరిమితమైంది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయగా, బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు బీఆర్‌ఎస్‌ను వీడారు. ముగ్గురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు కూడా జంప్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉండగా, రాజకీయ చతురుడైన కేసీఆర్‌ మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారు. తమ పార్టీ నుంచి వెళ్తున్న నేతలు అడ్డుకోవడంతోపాటు, క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు 25 మంది తనతో టచ్‌లో ఉన్నారని సంచల వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతాయని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ రేవంత్‌ సర్కార్‌ను వదిలి పెట్టదని హెచ్చరించారు.ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఇప్పుడు ఆ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. తాజాగా కేసీఆర్‌ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో చట్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్‌తో చట్‌లో ఉన్న ఆ 25 మంది ఎవరని అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఇంటర్వ్యూలో బీజేఎల్పీ నేత మమేశ్వర్‌రెడ్డి గురించి కూడా కేసీఆర్‌ ప్రస్తావించారు. ఆయన కాంగ్రెస్‌ సర్కార్‌ త్వరలో పడిపోతుందని, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుందని చెబుతున్నాడని, బీజే పీ ఎంపీ లక్ష్మణ్‌ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుందంటన్నారని తెలిపారుప్రధాని మోదీ ఏదో కార్యక్రమానికి హైదరాబాద్‌ వస్తే సీఎం ఏవంత్‌ ఆప్‌ బడే భాయ్‌ హై, మై చోటే భాయ్‌ హై అనటం పైన కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కొందరిలో అనుమానాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వచ్చారని చెప్పారు. మీరు, మేము కలిసి గవర్నమెంట్‌ ఫామ్‌ చేద్దామని ప్రతిపాదనలు కూడా తెచ్చారని పేర్కొన్నారు. అయితే, టచ్‌లో ఉన్నది ఎవరో చెప్పేందుకు కేసీఆర్‌ నిరాకరించారు.ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పుంజుకుంటుందని, 8 నుంచి 12 స్థానాల్లో తమ పార్టీ ఎంపీలు గెలుస్తారని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయాలు మారడం ఖాయం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్‌ఎస్‌ అన్ని సీట్లు గెలుస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో దాదాపు అన్నీ బీఆర్‌ఎస్‌కు 2 నుంచి 3 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపాయి. కొన్ని సర్వేలు 0 నుంచి 1 వస్తాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్‌ 8 నుంచి 12 అనడం కూడా చర్చనీయాంశమైంది

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!