ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు
వరంగల్: నర్సంపేట నియోజకర్గంలో ఎన్నికల హవా కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించిన మొదలు.. నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ప్రచారం బాట పట్టాయి.మొదటి దఫాగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్,కాంగ్రెస్, మధ్యే పోటీ ఉండనుంది. జిల్లాలో యువ ఓటర్లు, మహిళా ఓటర్లే.. అభ్యర్థి ముఖచిత్రాన్ని నిర్ణయించనున్నారు.నర్సంపేట నియోజకవర్గం లో ఓటర్లే ప్రధానంగా అభ్యర్థుల జాతకాన్ని నిర్ణయించనున్నారు. – ప్రధాన పార్టీలే బరిలో…. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, కొసమెరుపుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉంటారని తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నుండి దొంతి మాధవరెడ్డి, తో సైతం ప్రచారంలో జోష్ పెంచారు.అటు అధికార పార్టీ ఎమ్మెల్యే రోజుకొక మండలంలో పర్యటిస్తూ.. ఓటర్లను ఓట్లు అర్జిస్తున్నారు. – మరి ఓటర్ మాటేంటి…? నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు భిన్న కోణంలో ఆలోచిస్తున్నారు.60ఏళ్లు పైబడిన వారి మాట ఒక రీతిగా ఉండగా.. 18 నుంచి 40ఏళ్ల వారి మాట మరోరరకంగా ఉంది.గతంలో 2014,2018లో గుండుగుత్తగా కేసీఆర్‌ను చూసి ఓట్లు వేసిన ఓటర్లు.. ఈ దఫా మాత్రం లోకల్ క్యాండెట్ ను చూస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఊపుతో మూకుమ్మడిగా కేసీఆర్‌కు ఓటు వేసిన ప్రజలు.. ఇప్పుడు మాత్రం నర్సంపేట బరిలో నిలిచిన నేతలనే చూస్తున్నారు.ముఖ్యంగా అధికార పార్టీ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఐదేళ్లు నుంచి చూసామన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నారు. వృద్ధుల వరకు కేసీఆర్‌కే ఓటు వేస్తామంటుండగా.. యువజనులు,మధ్యతరగతి వయస్సు గల వారు మాత్రం లోకల్ అభ్యర్థిని బట్టి ఓటేస్తామని చెప్తున్నారు…
– ఏపార్టీకి కలిసొచ్చే మరి….
బీఆర్ఎస్:- నర్సంపేట నియోజకవర్గంలో ఓ వర్గం వరకు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు.మొదటి దఫాగా అధికారం అప్పజెప్పినా విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదని విద్యార్థిలోకం ప్రశ్నిస్తుంది. కేవలం పింఛన్లు,సంక్షేమ పథకాలు చూపిస్తూ ఓట్లు అడుగుతున్న అధికార పార్టీ.. విద్యార్థులను, నిరుద్యోగులను నట్టేటా ముంచిందని వాదిస్తున్నారు.ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపించిందని చెప్తున్నారు.గతేడాది విద్యార్థులు సైతం ఉద్యోగనోటిఫికేషన్లు రావట్లేదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు యువతలో మెదులుతున్నాయి.ఇక మనఊరు-మన బడి కింద పనులు పూర్తి కాలేదు అనేక మంది కాంట్రాక్టర్లకు చేసిన పనులకు నిధులు రావడం లేదని వాపోతున్నారు.దళిత బంధు,డబుల్ బెడ్ రూమ్‌లు అధికార పార్టీ అనుచరులకే ఇచ్చారనే ఆరోపణలు అధికార పార్టీపై ఉన్నాయి.అయితే.. వృద్ధులు, కొంతమంది రైతులు అధికార పార్టీపై సుముఖంగా ఉన్నారనడం సందేహమే.రైతు భీమా,రైతుబంధు, కళ్యాణలక్ష్మీ,షాదిముబారక్ లాంటి పథకాలు ఆసరాగా ఉన్నాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్ :- కాంగ్రెస్ యమ జోష్‌లో దూసుకెళ్తుంది. దొంతి మాధవరెడ్డి ఎప్పటి నుంచో.. అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపడంలో లోకల్ కాంగ్రెస్ లీడర్లు వెనకబడినా.. దొంతి మాధవరెడ్డి మాత్రం ప్రజల్లో ఊంటారన్నది ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశంగా కన్పిస్తున్నాయి.ఓ కుటుంబంలో విషాదం తలెత్తినా.. నేను ఉన్నానంటూ ఆ కుటుంబాలను పలకరించడం, భరోసాను ఇవ్వడం తోచినంత ఆర్థిక సాయం చేస్తూ ఉండటం దొంతి మాధవరెడ్డి ఎప్పటి నుంచో చేస్తున్నారు. అటు ప్రజానీకంలో కూడా దొంతి చెరుగని ముద్ర వేసుకున్నారు. ఆపదలో అండగా ఉండే నేతగా ఆయన మంచి చోటు సంపాదించారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోకి వెళ్లినా దొంతి మాధవరెడ్డి తెలియని ఇళ్లు ఉండదు.అలా దొంతికి కలిసి వస్తుంది..అటు యూత్ ఫాలోయింగ్ కూడా మెండుగానే ఉందని చెప్పాలి. గిరిజన బంజారా జాతి బిడ్డగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.కమ్మ సంఘం నేతలు సైతం లోకల్ నాయకుడిగా,బంజారా బాంధవుడిగా పేరు సంపాధించిన మాధవరెడ్డికి మద్థతు ఇస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది.ఇలా ఒకటి కాదు.. అన్ని వర్గాల ప్రజలు దొంతి వెంటే ఉన్నామంటూ గ్రామాల్లో చర్చించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసిరానుంది.. – ఓటింగ్ పై ఉత్కంఠ… ఏ నాయకుడు ఎంతపెద్దవారైనా.. ఏ నాయకుడు ఎంత ప్రచారం చేసినా వారి భవిష్యత్‌ను నిర్ణయించేది మాత్రం ఓటర్లే.ఈ నెల 30న జరగనున్న పోలింగ్‌లో నేతల భవితవ్యం తేలనుంది. నర్సంపేటలో ఎమ్మెల్యే పీఠం ఎవరెక్కుతారనేది నియోజకవర్గంలో ఉత్కంఠగా మారింది. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే మరి..!