Monday, December 23, 2024

నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకివ్వడం లేదు?

- Advertisement -

రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్ ?

రైతు భరోసా, వడ్లకు బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు?

నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకివ్వడం లేదు?

పంటల బీమా, వ్యవసాయ కూలీలకు సాయం ఏమైంది?

సాగు చేయాలంటేనే రైతులు ఇబ్బంది పడే దుస్థితి

యుద్ద ప్రాతిపదికన రైతాంగాన్ని ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్ కుమార్

గంభీరావుపేటలో నష్టపోయిన పంటలను పరిశీలించిన బండి సంజయ్

‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయడం లేదు? పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నరు. ఏమైంది?  ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామన్నరు..ఏది? రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల సాయం అందిస్తమన్నరు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటకు క్వింటాల్ కు 5 వందల రూపాయల బోనస్ ఇస్తామన్నరు… రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నరు. అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. మరి ఏమైంది?  వీటిలో ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేశారా? కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది?’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, పోతుగల్, గంభీరావుపేట ప్రాంతాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. బాదిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం నుండి సాయమందేలా క్రుషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ముస్తాబాద్, గంభీరావు పేటలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమదేవి, స్థానిక నేతల్తో కలిసి మీడియాతో మాట్లాడంతోపాటు  ప్రకటన విడుదల చేశారు…. అందులోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి….

రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల పంట నష్టం జరిగినట్లు మా ద్రుష్టికి వచ్చింది. ఈ జిల్లాలోనే వందలాది ఎకరాల పంట నీళ్లపాలైంది. దురద్రుష్టమేంటంటే… ప్రతి ఏటా అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ప్రక్రుతి వైపరీత్యాలకు తోడు సకాలంలో పొలాలకు నీళ్లు వదలకపోవడంవల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నరు.. కానీ గత పదేళ్లుగా రైతులకు నయాపైసా సాయం అందడం లేదు. అంచనాల పేరుతో, విచారణ, నివేదికల పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప సాయం అందించిన పాపాన పోలేదు.

కేసీఆర్ పాలనలో రైతులను లక్షాధికారులను చేస్తామన్నరు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నరు. పంట నష్టపోతే వెంటనే ఎకరాకు 10 వేల రూాపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పనికిరాదు… అంతకు మించి అద్బుతమైన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పిర్రు… చివరకు ఏమైంది? వీటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా? గత పదేళ్లుగా రైతులు పంట నష్టపోతూనే ఉన్నా నయాపైసా సాయం చేసిన పాపాన పోలేదు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వానికి  రైతుల ఉసురు తగిలింది. ఇంకా సిగ్గులేకుండా నిన్న అపర మేధావి ఇక్కడికి వచ్చి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేల పరిహారం అందించాలని, బీమా అందించాలని డిమాండ్ చేస్తున్నడు…అసలు ఆయనకు, ఆ పార్టీ నేతలకు మాట్లాడే నైతిక అర్హత ఉందా?

అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలు రైతులకు అరచేతిలో స్వర్గం చూపిర్రు… సాక్షాత్తు రాహుల్ గాంధీ  వరంగల్ రైతు డిక్లరేషన్ లో…..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తానన్నడు. భూమి ఉన్న రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15 వేల రూపాయల ఇస్తానన్నడు? అట్లాగే భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల సాయం అందిస్తానన్నడు ఏమైంది?

అట్లాగే పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని రూపొందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు.  ప్రక్రుతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటకు క్వింటాల్ కు 5 వందల రూపాయల బోనస్ ఇస్తామన్నరు…అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. మరి ఏమైంది?  వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఎందుకు అందించడం లేదు? మరి కాంగ్రెస్ కు… బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది?…

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు 20 వేలు అందించాలి. పంట నష్టం వివరాలను యుద్ద ప్రాతిపదికగా తెప్పించుకుని పూర్తిస్థాయి పరిహారం అందించాలి. పంటల బీమా పథకాన్ని ఆలస్యం లేకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్