Monday, March 24, 2025

దీపాదాస్ మున్షీపై వేటు ఎందుకు…?

- Advertisement -

దీపాదాస్ మున్షీపై వేటు ఎందుకు…?
హైదరాబాద్, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే )

Why the attack on Deepadas Munshi...?

కొన్నిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మార్పు ఉంటుందని వార్తలు గట్టిగా వినిపించాయి. అనుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించింది. ఒకట్రెండు రోజుల్లో మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కొత్త ఇన్‌ఛార్జ్‌గా.. రాష్ట్ర అధినాయకత్వంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరరాజన్‌ ముందు ఉన్న సవాళ్లు ఏంటనే చర్చ సాగుతోంది. బాధ్యతలు చేపట్టగానే ఆమె ముందు ఉన్న మెయిన్ టాస్క్‌.. లోకల్ బాడీ ఎన్నికలు. ఈ బాధ్యతలను అధిష్టానం ఆమెపై ఉంచింది. ముందుగా ఇందులో నటరాజన్.. తన మార్క్‌ చూపించి.. శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాల్సి ఉంది. వీటితో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆమె ముందున్న మరో బిగ్ టాస్క్. నేతలను వ్యక్తిగతంగా కలిసి అందరి సమస్యలు తెలుసుకుని అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందనేది నేతల మాటగా తెలుస్తోంది.మరోవైపు.. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దూతూనే .. కొన్ని అంశాల్లో ఆచూతూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి..టీపీసీసీ కి మధ్య వారధిగానూ ఆమె సేవలు అత్యంత కీలకం కానున్నాయనేది పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న చర్చ. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలను.. ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లాంటివి కూడా కీలకంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు సమన్వయంతో కార్యచరణ రూపొందించడం కూడా కొత్త బాస్‌ ముందున్న టాస్క్‌గా తెలుస్తోంది.మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికి.. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ సముచిత గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాల్సి ఉంది. పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా మంచి జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించేలా కొత్త సారథి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే..గతంలో పనిచేసిన అనుభవంతో మీనాక్షి.. ఈ టాస్క్‌లు పెద్ద లెక్క కాదనే వాదనలు ఉన్నాయి. నిజాయితీగా పనిచేసే వారికి సముచిత స్థానం ఇవ్వాలనే ఆలోచనతోనే.. కేంద్ర అధినాయకత్వం మీనాక్షిని తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పంపిందట. సో ఆశించిన విధంగా పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది.ఇప్పటివరకు దీపాదాస్ మున్షీ.. కేరళ రాష్ట్రంతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అందించారు. ప్రస్తుతం ఆమెను.. కేరళకు ఫుల్ టైమ్‌ ఇన్‌ఛార్జ్ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజురోజుకీ వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఇక్కడ ఫుల్‌ టైమ్‌ బాధ్యతల కోసం మీనాక్షిని.. కాంగ్రెస్ నియమించింది. మరోవైపు.. మున్షిపై.. కొన్ని నెలలుగా భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సమయానికి నేతలకు అందుబాటులో లేకపోవటం ఆమెకు మైనస్‌గా మారిందనే టాక్ ఉంది. కీలక సమయాల్లో ఆమె పాత్ర లేకపోవడం .. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోను ఆంటీముట్టనట్టుగా వ్యవహారించారనే గుసగుసలున్నాయి. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ.. మీనాక్షిని రంగంలోకి దించిందనే చర్చ సాగుతోంది.మొదటిసారిగా లోకల్ బాడీ ఎన్నికలకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. తన మార్క్ కనబర్చాలని ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ కూడా రావడంతో…పార్టీపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చి.. అధిష్టానానికి భరోసా కల్పించడం సహా క్యాడర్, లీడర్లలో ఉత్సాహం నింపాల్సి ఉంది. తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మీనాక్షీ ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్తారనేది చూడాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్