రేవంత్ పార్టీ మారతారా…?
హైదరాబాద్, మార్చి 14, (వాయిస్ టుడే )
Will Revanth change party...?

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వేదికగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా షాక్ ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు ఎప్పటి నుంచొ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే కేంద్ర మంత్రులను కలవకుండా వచ్చిన పరిస్థితి లేదు. ఏఐసిసి పెద్దలకంటే బీజేపీ నేతలకే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది.ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసి సందర్భంగా బయటికి వచ్చిన ఫోటోలు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. గత పదేళ్ళలో ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని ఇతర ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు గాని.. ఈ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే వారు కాదు. దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఎన్నోసార్లు విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది.అలాంటిది రేవంత్ రెడ్డి పదేపదే వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా కనపడలేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం.. ఈ మధ్యకాలంలో సంచలనం అవుతుంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి బిజెపి నేతలతో స్నేహం చేయడం సంచలనంగా మారింది.త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని కాస్త దూరం పెడుతుంది అనే వార్తలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సంచలనమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులను రేవంత్ రెడ్డికి అసలు సీరియస్ గా తీసుకుని విసిగిపోయినట్లు సమాచారం. సీనియర్ నేతలు ఎన్నికల ముందు కాస్త సహకరించినా.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు తీసుకుని కూడా, తనకు సహకరించడం లేదు అనే కోపంలో రేవంత్ రెడ్డి ఉన్నారుఅందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపితోనే ఎక్కువగా స్నేహం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిజెపి నేతలతో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. దీనితో ఆయన కచ్చితంగా కమలం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
ప్రచారానికి ఫుల్ స్టాప్
మరో వైపు తెలంగాణలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో ఏదైనా సాధించుకునే సత్తా తనకు ఉందన్నారు. తాను ఎవరి ట్రాప్‌లో పడనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ప్రభుత్వం, పార్టీపై తనకు పూర్తి పట్టు ఉందని చెప్పుకొచ్చారు.గాంధీ ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి మధ్య చాలా గ్యాప్ పెరిగిందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గాంధీ ఫ్యామిలీతో దూరం పెరగడం వల్లే ఆయనకు అధిష్టానం కనీసం అపాయిట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి.సీఎం రేవంత్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. అధిష్టానాన్ని కలిసినట్టుగా ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎవరో తెలియకుండానే పార్టీ పీసీసీ చీఫ్, సీఎంను చేశారా? అంటూ సూటిగా సీఎం రేవంత్ ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉందని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ కోరారు.