మాజీఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి
Woman dies after being hit by former MLA’s car
*వాయిస్ టుడే, హనుమకొండ జిల్లా:* స్టేషన్ ఘనపూర్ మాజీఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఘనపూర్ నుండి హనుమకొండ కు వస్తున్నక్రమంలో కాజీపేట మండలం మడికొండ వద్ద ఎస్సీ కాలనికి చెందిన కలకోట్ల స్వప్న(40) కు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో స్వప్న అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న మడికొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మహిళ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు మడికొండ సి.ఐ ప్రతాప్ తెలిపారు.
*కారును వదిలి వెళ్లిపోయిన రాజయ్య..*
ప్రమాదం జరిగిన అనంతరం మాజీఎమ్మెల్యే రాజయ్యను స్థానికులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ వెళ్తున్నట్టు చెప్పి అక్కడినుంచి తప్పించుకుని కాజీపేట పట్టణం బాపూజీనగర్ చౌరస్తా వద్ద తన కారును వదిలివెళ్లిపోయారు.


