సమన్వయంతో పనిచేయండి

- Advertisement -

సమన్వయంతో పనిచేయండి

Work in coordination
మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, ,సెప్టెంబర్ 21
సమన్వయంతో పనిచేసి తాడేపల్లిగూడెం పట్టణాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. శనివారం ఆయన మున్సిపాలిటీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలో సంభవించిన వరదల వల్ల ఎంతో నష్టం జరిగిందని అక్కడ ఉన్న  సేవ చేయడంలో వివిధ శాఖల అధికారులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు అమోఘమని ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. గత ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీ నిర్వీర్యమైందని తెలిపారు. గతంలో వాలంటీర్లుగా పనిచేసి రాజీనామా చేసిన వాలంటీర్లను తీసుకొని అవకాశం లేదని, రాజీనామా చేయని వాలంటీర్లను వివిధ సచివాలయాల్లో వారిని వినియోగించుకుంటామని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని తెలిపారు.  గతంలో మునిసిపాలిటీకి మంజూరైన నిధులు నెరవేరమైపోయాయని వివరించారు. తిరుపతి దేవస్థానం విషయంలో ఎన్నో వివరించారు అన్ని పార్కులను బాగు చేస్తామని తెలిపారు. ఆర్డీవో వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.   మున్సిపల్ పరిధిలో మంజూరైన నిధులను ఆ మున్సిపాలిటీ కే ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వచ్ఛత్  ఈ సేవ పేరున 5కె రన్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో కాలేజీలు మానవతా లాయర్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ వివిధ ప్రభుత్వ శాఖలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని  స్వచ్ఛంద సేవా సంస్థలు, ఫ్యాక్టరీల వాళ్లు భాగస్వామ్యంతో 5కే రన్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular