టికెట్ రాకపోయినా కేసీఆర్ గీసిన గీతను దాటేదిలేదని… తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ MLA రాజయ్య స్పష్టంచేశారు. తనను అభ్యర్థిగా ప్రకటించకపోవడం పట్ల తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఘన్ పూర్ భారాస టికెట్ విషయంలో తొలినుంచీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కడియం, రాజయ్య మధ్య పోటాపోటీ సాగింది. చివరి వరకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేయగా…. కడియం వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. టికెట్లు ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన రాజయ్యను కలిసేందుకు అనుచరులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య….. బోరున విలపించారు. తనను నమ్ముకున్న ప్రజల కోసమే చివరి వరకు పనిచేస్తానన్నారు. ప్రస్తుత పదవిని మించిన బాధ్యతలను అప్పగిస్తానని అధినేత మాటిచ్చినట్లు రాజయ్య తెలిపారు.