Monday, January 26, 2026

పవన్ వ్యాఖ్యలతో వైసీపీ ఫైర్

- Advertisement -

పవన్ వ్యాఖ్యలతో వైసీపీ ఫైర్

YCP Fire with Pawan's comments

విజయవాడ, నవంబర్ 5, (వాయిస్ టుడే)

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇతర కేసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేసిన కామెంట్స్ కాకా రేపుతున్నాయి. దీనిపై హోంమంత్రి, డీజీపీ వివరణ ఇచ్చుకుంటే… వైసీపీ మాత్రం విమర్శల వాడి పెంచింది. ఇది కచ్చితంగా అటు పవన్ కల్యాణ్‌ను, ఇటు కూటమి ప్రభుత్వంపై ఘాటుగా వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ ఎక్కడా ఎవర్నీ తప్పుపడుతూ మాట్లాడలేదని… వ్యవస్థలో ఉన్న లోపలను ఎత్తి చూపారని కామెంట్ చేశారు హోంమంత్రి అనిత. తనపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన చెప్పిన విషయాలను పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల అధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి… అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లుగా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని… ఇప్పుడు గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోందన్నారు అనిత. ఆ విషయాన్ని తామంతా లోపల మధనపడుతుంటే పవన్ కల్యాణ్ బహిరంగంగా చెప్పారని అన్నారు. లా అండ్ ఆర్డర్ పక్కగా అమలు చేసేందుకు యత్నిస్తుంటే కొందరు అలసత్వం చూపుతున్నారని అఁదుకే అలా స్పందించాల్సి వచ్చిందన్నారు. గతంతో పోలిస్తే నేరల తీవ్ర పెరుగుతోందని తప్పించుకోవడానికి నిందితులు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారని అని తెలిపారు. అందుకే నిందితులకు వెంటనే శిక్షలు వేసేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని ఆ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనిత. సద్విమర్శలు కచ్చితంగా ఎవరికీ ఎలాంటి హాని కలగదన్న ఆమె…. తప్పుడు సమాచారంతో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో సోషల్ మిడీయా పీఎస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాన్నారు. గత ఐదేళ్లు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం, పోలీసులు అధికా ప్రాధాన్యత ఇచ్చారన్నారు అనిత. ఇప్పుడు వారిలో కొందరిలో మార్పు వచ్చినా ఇంకా మారాల్సింది చాలానే ఉందన్నారు. గతంలో గంజాయి, మాదకద్రవ్యాలను పట్టించుకోకుండా వదిలేశారని వాటి బారిన పడిన చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారని మెల్లిగా మార్పు వస్తుందన్నారు. సోషల్ మిడియాలో పోస్టు పెట్టినా, విమర్స చేసినా జైలుకు పంపించిన జగన్, వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరుంగా ఉందన్నారు. కచ్చితంగా పరిస్థితులు సర్ధుకుంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అనంతపురంలో స్పందించారు. ఐదేళ్లలో జరిగిన తప్పులే ఇప్పుడు వెంటాడుతున్నాయన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకే తమ ఫస్ట్ ప్రయార్టీ ఉంటుందన్నారు. బాధ్యతాయుతంగా ఉండేలా వ్యవస్థలో చర్యలు తీసుకున్నామని దీన్ని మరింత పటిష్టంగా మార్చే ప్రక్రియ చేపడతామన్నారు. కొందరు పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలపై కూడా మాట్లాడారు. గతంలో దాడులు జరిగినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని అన్నింటినీ సరి చేసి వ్యవస్థను సెట్‌రైట్ చేస్తున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ… ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ఉదయం నుంచి వరుసగా ప్రెస్‌మీట్‌లు పెడుతున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెబుతుంటే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఇదే విషయాన్ని ఇప్పుడు వపన్ కల్యాణ్ చెబుతున్నారన్నారు. హోంమంత్రిగా అనిత, సీఎంగా చంద్రబాబు విఫలం అయ్యారని తాము ముందునుంచే చెబుతున్నామన్నారు. ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్న పవన్ చెప్పారన్నారు ఎమ్మెల్సీ వరుద కల్యాణి. నైతిక బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాలన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్