అధినేత ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు

- Advertisement -

అధినేత ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు

YCP leaders conducted special pujas as per the orders of the leader

 చెన్నకేశవ స్వామి దేవాలయం నందు పాప ప్రక్షాళన పూజ నిర్వహించిన మండల వైసీపీ నాయకులు

తుగ్గలి
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడడానికి శనివారం రోజున దేవాలయాల యందు పాప ప్రక్షాళన పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో మండల కేంద్రమైన తుగ్గలి నందు మండల వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో చెన్నకేశవ స్వామి దేవాలయం నందు పాప ప్రక్షాళన పూజలను వారు నిర్వహించారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కాలినడకన తుగ్గలి లో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి చేరుకొని పండితుల ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప ప్రక్షాళన పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ వారు పాల్పడుతున్నారని వారు తెలియజేశారు.కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర రాజకీయాలు తగవని వారు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీవారి లడ్డుపై నిందలు వేయడం సరికాదని వారు తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక ఇలాంటి కొత్త కొత్త సమస్యలను సృష్టించి కాలయాపన చేస్తున్నారని వారు ప్రభుత్వం పై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,ఉప్పర్లపల్లె సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, రాతను మోహన్ రెడ్డి, పెండేకల్ గోపాల్ రెడ్డి,జడ్పిటిసి పులికొండ నాయక్, ఎంపీపీ ఎర్ర నాగప్ప,తుగ్గలి ఎంపీటీసీ రాజు,టిఎండి హుస్సేన్,చాంద్ భాషా, నారాయణ నాయక్, రాంపల్లి నాగభూషణం రెడ్డి, బసిరెడ్డి,శభాష్ పురం హనుమంతు, రాఘవరెడ్డి,పాటిల్ సుధాకర్ రెడ్డి, రామకొండ చంద్రశేఖర్ రెడ్డి,చెన్నంపల్లి రంజాన్, బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి,బద్రి, ముక్కెళ్ల గోవర్ధన్ రెడ్డి, గోవిందరాజులు తదితర మండల వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular