- Advertisement -
స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి నామినేషన్
బోగోలు ఏప్రిల్ 22
కావలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ మరియు ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ 22వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కావలి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో శీనా నాయక్ కు నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం ఆర్ డిఓ కార్యాలయం ఎదురుగా పసుపులేటి సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన్నట్లు తెలిపారు.వైసిపి టిడిపి పార్టీలతో ప్రజలు విసిగిపోయారని అత్యధిక మెజారిటీతో తనను గెలిపిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -