Sunday, September 8, 2024

ధరణి తప్పుల తడకని నువ్వే చెప్పుకున్నవ్ కదా….

- Advertisement -

కేసీఆర్….
ఇదిగో నీ అఫిడవిట్
నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది
మరి ఇప్పుడేమంటావ్…..
నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానని చెప్పను. నాకు అలవాటు కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుంది. అంతే తప్ప నేను సీఎం అవుతానని ఎన్నడూ చెప్పను.’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్తనైన తనకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులిచ్చి గౌరవించిన పార్టీ బీజేపీయేనన్నారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే నాకు శిరోధార్యమన్నారు. ప్రధానిసహా పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని ఉద్ఘాటించారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ చొప్పదండి నియోజకవర్గఅభ్యర్ధి బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సహా పలువురు జిల్లా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

you-yourself-said-that-dharani-does-not-make-mistakes
you-yourself-said-that-dharani-does-not-make-mistakes

చొప్పదండిలో బొడిగె శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలపై బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేయడం సిగ్గు చేటు. మీకు దమ్ముంటే మీరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పండి. అభివ్రుద్ధిపై మాట్లాడండి. అంతే తప్ప పోస్టర్లతో శోభ చేసిన అభివ్రుద్ధి ప్రజలకు తెలియకుండా చేయాలనుకోవడం మూర్ఖత్వం.   దుబ్బాకలో, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇట్లనే చేశారు. చివరకు ఏమైంది? బీఆర్ఎస్ ఓడింది. బీజేపీ దమ్ము చూపింది. ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్రకు కేసీఆర్ తెరతీసిండు. పొరపాటున బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం తథ్యం.
ఎందుకంటే… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారు. అప్పుడు హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు బయటకు వస్తారు. కేటీఆర్ అహంకారం, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ప్రభుత్వం కూలిపోవడం పక్కా… అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం అందరూ కొట్లాడుకుంటరు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి సహా ప్రతి ఒక్కరూ మాకే సీఎం కావాలని గోల పెడతరు…. ఈ సీఎం కుర్చీ కొట్లాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు ఎన్నికలు తథ్యం.

you-yourself-said-that-dharani-does-not-make-mistakes
you-yourself-said-that-dharani-does-not-make-mistakes

తెలంగాణలో సుస్థిర పాలన కావాలంటే అది బీజేపీకే సాధ్యం.
అయితే అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానని చెప్పను. అది నాకు అలవాటు లేదు.  ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుంది. అంతే తప్ప నేను సీఎం అవుతానని ఎన్నడూ చెప్పను. సామాన్య కార్యకర్తనైన నన్ను ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసింది పార్టీయే. బీజేపీ నిర్ణయమే నాకు శిరోధార్యం. అయితే బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. ప్రధానిసహా పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది కూడా…
ధరణి గురించి మాట్లాడితే నన్ను సన్నాసి అంటున్నడు.. నాకేం తెల్వదట. ఇదిగో కేసీఆర్…. ఎన్నికల కమిషన్ కు నువ్వు ఇచ్చిన అఫిడవిట్ ఇది.. (కేసీఆర్ అఫిడవిట్ చూపిస్తూ)…‘‘నాకు మొత్తం 53 ఎకరాల 30 గుంటల భూమి మాత్రమే ఉంది. కానీ ధరణి రికార్డుల్లో మాత్రం 53 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు చూపుతుంది. అంటే గుంట భూమి ఎక్కువ చూపుతోంది. దీనిని కరెక్ట్ చేయాల్సి ఉంది’’ అని రాసిచ్చినవ్ కదా…. ఇది ఎవరి తప్పు… ఇప్పుడు ఎవరు సన్నాసి? నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటవా? నీదో దిక్కుమాలిన ప్రభుత్వమని నీకు అనిపిస్తలేదా..? ఇట్ల  తెలంగాణ రైతుల భూముల ఎవరెవరి రికార్డులు తారుమార్జేసినవ్.  ధరణి పేరుతో ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నవ్ కేసీఆర్.
బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు అర్ధమైంది. అందుకే ఓడిపోయే బీఆర్ఎస్ వదిలేసి ఆ స్థానాల్లో  కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపుతున్నడు. వాళ్లు గెలిచాక బీఆర్ఎస్ లోకి వచ్చేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా లోపాయికారీ ఒప్పందం చేసుకున్నడు. అధికారం కోసం సొంత పార్టీ నేతలను కూడా ఓడగట్టేందుకు వెనుకాడని నీచుడు కేసీఆర్. మందికి పుట్టిన పిల్లలను తన పిల్లలుగా చెప్పుకునే రకం. ఛీ..ఛీ.. ఇంత నీచుడిని ఇంతవరకు చూడలే…కాసులకు అమ్ముడుపోయే కాంగ్రెస్ ను, తెలంగాణను నాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్