Monday, March 24, 2025

యూ ట్యూబ్ గ్రామం 6000 మంది జనాభాకు 1100 చానెల్స్

- Advertisement -

యూ ట్యూబ్ గ్రామం
6000 మంది జనాభాకు 1100 చానెల్స్
రాయ్ పూర్, ఫిబ్రవరి 28, (వాయిస్ టుడే)

YouTube village
1100 channels for a population of 6000 people

ఆ ఊళ్లోకి వెళ్తే ప్రతీ వీధిలోనూ ఎవరో ఒకరు కెమెరాలు పెట్టుకుని లేదో ఫోన్లతో వీడియోలు షూట్ చేస్తూ.. కంటెంట్ క్రియేషన్ లో కనిప్తారు. ఏ ఇంట్లో చూసినా ఓ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. ఎడిటింగ్ రూమ్ ఉంటుంది. అదేమి పెద్ద ఊరు కాదు.. చిన్న గ్రామం. పేరు తులసి. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉంటుంది. వారంతా సోషల్ మీడియాకు.. యూట్యూబ్ కు బానిసలు కాలేదు. ఉపాధిగా మార్చుకున్నారు. ప్రతి ఒక్క కుటుంబం యూట్యూబ్ తో భారీగా సంపాదిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.  ఛత్తీస్ ఘడ్‌ అంటేనే వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో యూట్యూబ్ విప్లవం రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇద్దరు కుర్రాళ్లు మొత్తం మార్చేశారు. తలసి గ్రామం నుంచి ఇద్దరు కుర్రాళ్లు బాగా చదువుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఛత్తీస్ ఘడ్ గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఓ యూట్యూబ్ చానల్ పెట్టారు. దాంట్లో కంటెంట్ ను తమ ఊళ్లోనే రూపొందించేవారు.  అయితే ఆ వీడియోలు పాపులర్ అయ్యేవి. ఇదేదో బాగుందని ఇతర యువకులు కూడా యూట్యూబ్ పై దృష్టి పెట్టారు. కానీ అక్కడే క్రియేటివ్ గా ఆలోంచించారు. విభిన్న రంగాల్లో తమ కంటెంట్ ఉండాలని.. ఎవరికి వారు కొత్తగా ఆలోచించి యూట్యూబ్ చానళ్లు ప్రారంభించారు.మొదట యూట్యూబ్ చానళ్లు ప్రారంభించిన కుర్రాళ్లు.. తమకు మాత్రమే చానళ్లు ఉండాలని అనుకోలేదు. ఈ రంగంలో ఎంత మంది అయినా సంపాదించుకోవచ్చని అందర్నీ ప్రోత్సహించారు. కుర్రాళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరు తమ క్రియేటివిటీని చూపించి సక్సెస్ అవుతూంటే మహిళలు కూడా బయటకు వచ్చి.. వారు కూడా వీడియోలు చేయడం ప్రారంభించారు. మహిళల వీడియోలు కూడా పాపులర్ అయ్యేవి. దీంతో ఇప్పుడు అక్కడ ప్రతి ఇంట్లో యూట్యూబ్ నుంచి వచ్చే సిల్వర్, గోల్డెన్ మెమెంటోలు కనిపిస్తూ ఉంటాయి.  ఈ చానల్స్ లోవీడియో లు తీసేవారెవరూ బయటకు పోరు. వీలైనంత వరకూ తమ గ్రామంలోనే కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఈ విలేజ్ మంచి పురోగతి సాధిస్తూండటంతో ప్రభుత్వం కూడా ఓ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఆ ఊళ్లో ఏర్పాటు చేసింది. కొత్తగా వచ్చే యువతరానికి శిక్షణ ఇస్తున్నారు. ఈ యూట్యూబ్ విప్లవం వల్ల ఉద్యోగాలు లేకుండా చెడుదారి పట్టే యువతకు ఇప్పుడు తీరిక లేకుండా క్రియేటివ్ గా ఉన్నారని.. చాలా వరకూ మెరుగుపడ్డారని సంతోషపడుతున్నారు. ఇప్పుడీ విలేజ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్