- Advertisement -
By MOHAMMAD
కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లాఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
- Advertisement -




