కేతకీ సంగమేశ్వర ఆలయంలో ఘనంగా గంగా హారతి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ ప్రాంగణం

- Advertisement -

By MOHAMMAD

ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గంగా హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భక్తిపారవశ్యంలో గంగా హారతిలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular