- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం 44వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిని సందర్శించి కరపత్రాలు పంపిణీ చేస్తూ పథకం ప్రయోజనాలు, అర్హతలు, నమోదు ప్రక్రియను వివరించారు. డిసెంబర్ 4 నుంచి 10 వరకు భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద రేషన్, ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరవేయడమే లక్ష్యమని జగదీష్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -




