- Advertisement -
By MOHAMMAD
జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనీలో నివసించే భన్నూరు లలిత ఇంట్లో 18 తులాల బంగారం చోరీకి గురైంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం ఇస్లాంపూర్‌కు వెళ్లిన ఆమె, ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి బీరువాలోని బంగారం కనిపించలేదని గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలో నివసిస్తుండగా, ఇటీవలే ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -




