- Advertisement -
By Rachakonda Ramachandra Raju
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ హాస్పిటల్‌ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 1971లో డాక్టర్ ఏపీ విఠల్ ప్రారంభించిన విఠల్ హాస్పిటల్ వైద్య సేవల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆధునిక సదుపాయాలతో సుప్రజ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు,,ప్రముఖులు పాల్గొన్నారు.
- Advertisement -




