- Advertisement -
By ఆముదాల వెంకన్న
బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, లైంగిక దాడులపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
- Advertisement -




