ఇంకుడు గుంతల పోటీ.. రూ.10 లక్షల బహుమతులు!

- Advertisement -

ఇంకుడు గుంతల పోటీ.. రూ.10 లక్షల బహుమతులు!

‘ఆలివ్‌ మిఠాయి–ఇంటికో ఇంకుడు గుంత’ కార్యక్రమానికి శ్రీకారం
పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

Soak pit competition… prizes worth Rs. 10 lakh!

హైదరాబాద్‌, నవంబర్‌ 18: నగరంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఆలివ్‌ మిఠాయి సంస్థ ‘ఇంటికో ఇంకుడు గుంత’ పేరుతో వినూత్న పోటీకి శ్రీకారం చుట్టింది. ఈ పోటీలకు సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను బుధవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరదల ముప్పును తగ్గించడంతోపాటు వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. వర్షాలు తక్కువగా కురిసినా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే నీటి సమస్యలను చాలావరకు అధిగమించవచ్చని పేర్కొన్నారు.

వీడియోలకు రూ.10 లక్షల బహుమతులు

ఇంకుడు గుంతను నిర్మించి, ఆ ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని @oliveforsociety పేజీకి కొలాబ్‌ పోస్ట్‌గా షేర్‌ చేసి, ఆ పేజీని ఫాలో కావాలని ఆలివ్‌ మిఠాయి సంస్థ యజమాని దొర రాజు సూచించారు. పోటీలో వచ్చిన వీడియోల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన వాటికి మొత్తం రూ.10 లక్షల బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘సేవ్‌ వాటర్‌–సేవ్‌ ఎర్త్‌’, ‘ట్రీ గార్డ్‌–వర్కింగ్‌ ఫర్‌ గ్రీన్‌ వరల్డ్‌’ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు.

వర్షపు నీటిని నిల్వ చేసేందుకు నగరంలోని చెరువులను పునరుద్ధరిస్తున్న హైడ్రాకు దొర రాజు కృతజ్ఞతలు తెలిపారు. నగర చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్న హైడ్రా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. విజేతలకు హైడ్రా కమిషనర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular