Monday, March 24, 2025

ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు

- Advertisement -

ఆర్టిఫిషియల్ హార్ట్ తో 100 రోజులు
న్యూఢిల్లీ, మార్చి 13, (వాయిస్ టుడే )

100 days with an artificial heart
100 days with an artificial heart
100 days with an artificial heart

వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. కృత్రిమ గుండెతో ఓ వ్యక్తి ఏకంగా వంద రోజులు జీవించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుండె దాత కోసం ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియాకి చెందిన 40 ఏళ్ల రోగికి వైద్యులు కృత్రిమ టైటానియం గుండెను అమర్చారు. అయితే అతడు 100 రోజులు జీవించాడు. ఈ సాంకేతికతతో ఇప్పటివరకు ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అతడే. గత ఏడాది నవంబర్‌లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో సదరు రోగికి కృత్రిమ టైటానియం గుండెను వైద్యులు ఇంప్లాంట్‌ చేశారు. అయితే ఈ నెల ప్రారంభంలో గుండె దాత దొరకడంతో అప్పటి వరకు ఆ రోగి కృత్రిమ గుండెతో బతికేలా వైద్యులు చికిత్స అందించారు.తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్, మోనాష్ విశ్వవిద్యాలయం, ఈ పరికరం వెనుక ఉన్న యుఎస్-ఆస్ట్రేలియన్ కంపెనీ బివాకర్ మీడియాకు తెలిపారు. గుండె వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తులకు కృత్రిమ హృదయం దీర్ఘకాలిక ఎంపికను అందించగలదనే సంకేతంగా ఈ పరికరం అతని ప్రాణం ఇంత కాలం నిలబెట్టగలిగింది. అయితే ఈ పరికరం ఇంకా ట్రయల్ దశలో ఉంది. సాధారణ ఉపయోగం కోసం ఇంకా ఆమోదించబడలేదని వైద్యులు తెలిపారు. BiVACOR (ఆర్టిఫిషియల్‌ గుండె) వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియన్ బయో ఇంజనీర్ డేనియల్ టిమ్స్.. తన తండ్రి గుండె జబ్బుతో మరణించిన తర్వాత ఈ పరికరాన్ని కనిపెట్టాడు. తాజాగా ఓ రోగి దీని ఆధారంగా 100 రోజులు బ్రతకం చూసి దశాబ్దాల తన కృషి ఫలించడం చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మా ఆర్టిఫిషియల్ హార్ట్ పై నమ్మకం ఉంచినందుకు రోగికి, అతని కుటుంబానికి BiVACOR బృందం కృతజ్ఞతలు తెలుపుతోందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. వారి ధైర్యం లెక్కలేనన్ని రోగుల ఈ ప్రాణాలను రక్షించే సాంకేతికతను పొందడానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు ఆర్టిఫిషియల్‌ గుండె అనేది టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్. ఇందులో ఒకే కదిలే భాగం ఉంటుంది. ఇది అయస్కాంతాల ద్వారా ఉంచబడే లెవిటేటెడ్ రోటర్. దీని పేరు మాదిరిగి ఇది టైటానియంతో నిర్మించబడింది. ఇది శరీరానికి, ఊపిరితిత్తులకు రక్తాన్ని పంప్ చేస్తుంది. గుండె రెండు జఠరికల పనిని ఇది చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 18 మిలియన్ల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు. దాతల కోసం వెయిటింగ్ లిస్టులో కొట్టుమిట్టాడుతున్న ఎక్కువ మందిని కాపాడటానికి ఈ పరికరాన్ని ఉపయోగించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ ప్రకారం 2024 లో దాదాపు 3,500 మందికి గుండె మార్పిడి జరిగింది. అదే సంవత్సరం దాదాపు 4,400 మంది వెయిటింగ్ లిస్టులో చేరారు. ఆర్టిఫిషియల్‌  గుండె.. గుండె మార్పిడికి పూర్తిగా కొత్త ఆశలకు నాంది పలికిందని అన్నారు. రాబోయే దశాబ్దంలో దాత గుండె కోసం వేచి ఉండలేని రోగులకు లేదా దాత గుండె అందుబాటులో లేనప్పుడు కృత్రిమ గుండె ప్రత్యామ్నాయంగా మారడాన్ని మనం చూస్తాం’ అని ఆస్ట్రేలియన్ రోగి కోలుకోవడాన్ని పర్యవేక్షిస్తున్న క్లినికల్ ట్రయల్స్ కోసం పరికరాన్ని సిద్ధం చేయడంలో పాల్గొన్న వైద్యుడు హేవార్డ్ అన్నారు.ఈ పరికరాన్ని ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభ సాధ్యాసాధ్య అధ్యయనంలో పరీక్షించారు. దీనిలో భాగంగా ఐదుగురు రోగులు ఈ పరికరాన్ని విజయవంతంగా అమర్చారు. మొదటిది గత జూలైలో, టెక్సాస్ మెడికల్ సెంటర్‌లో శస్త్రచికిత్స సమయంలో ఎండ్-స్టేజ్ గుండె వైఫల్యంతో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి ఇంప్లాంట్ చేశారు. దాత అందుబాటులోకి వచ్చే వరకు అది అతన్ని ఎనిమిది రోజులు సజీవంగా ఉంచింది. ఇలా ఈ అధ్యయనంలో మరో నలుగురు రోగులకు అమర్చారు. ఈ ట్రయల్ 15 మంది రోగులకు అమర్చాలని వైద్యులు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్