- Advertisement -
కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోపక్క ఇప్పటికే కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు వేస్తామని ప్రకటించారు.
- Advertisement -