పీలేరు అటవీ ప్రాంతంలో 14ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఒకరు అరెస్టు
అన్నమయ్య
పీలేరు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్సు పోలీసులు 14ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన విష్ణువర్ధన్ కుమార్ టీమ్ ఆదివారం తిరుపతి హెడ్ క్వార్డర్స్ నుంచి బయలుదేరి అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలనం పీలేరు అటవీ ప్రాంతంలోని ఎల్లమంద చేరుకుని, మంచాల మంద వైపు కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. వీరు మారెళ్ల ఫారెస్టు బీటు పరిధిలోని పింఛానది సమీపం చేరుకునే సరికి కొంత మంది వ్యక్తులు తలలపై ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని హెచ్చరించి చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలను పడేసి పారిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని తమళనాడు, వేలూరు జిల్లా ఆనైకట్టు ప్రాంతానికి చెందిన బలరామన్ పెరియస్వామి (44)గా గుర్తించి అరెస్టు చేశారు. అక్కడ పడి ఉన్న 14ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిని, ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్ఐ సిహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.
అటవీ ప్రాంతంలో 14ఎర్రచందనం దుంగలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -