Thursday, January 2, 2025

23వేల కోట్లకు చేరిన అప్పు

- Advertisement -

23వేల కోట్లకు చేరిన అప్పు

23 thousand crore debt

విజయవాడ, నవంబర్ 2, (వాయిస్ టుడే)
రాష్ట్ర ప్రభుత్వం నిధుల‌ను స‌మ‌కూర్చే ప్ర‌క్రియ‌లో భాగంగా.. అప్పు కోసం ఆస్తుల‌ను ఇండెంట్ పెడుతుంది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరుసార్లు రూ. 20,000 కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల‌ను వేలానికి పెట్టింది. తాజాగా ఈనెల 29న నిర్వ‌హించిన‌ సెక్యూరిటీస్ వేలంలో మ‌రో రూ. 3,000 కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వేలం వేసింది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్‌బీఐ వాటిని విక్రయించింది.
జూన్ 11న రూ.2,000 కోట్లు..
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే జూన్ 11న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 2,000 కోట్ల (రూ.500 కోట్లు, రూ.500 కోట్లు, రూ.1,000 కోట్లు) అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.500 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్ల, రూ.1,000 కోట్ల విలువ చేసే ఒక సెక్యూరిటీ బాండ్ రాష్ట్ర ప్ర‌భుత్వం వేలానికి పెట్టింది. మొద‌టి రూ.500 కోట్ల‌ బాండు 15 ఏళ్లు, రెండో రూ.500 కోట్ల బాండు 19 ఏళ్లు, రూ.1,000 కోట్ల బాండ్ 21 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
జూన్ 25న రూ.2,000 కోట్లు..
జూన్ 25న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 2,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున రెండు బాండ్లు) అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 11 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
జులై 2న రూ.5,000 కోట్లు..
జులై 2న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 5,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున ఐదు బాండ్లు) అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే ఐదు సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 9 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 12 ఏళ్లు, మూడు రూ.1,000 కోట్ల‌ బాండు17 ఏళ్లు, నాలుగో రూ.1,000 కోట్ల బాండు 21 ఏళ్లు, ఐదో రూ.1,000 కోట్ల బాండు 24 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది.
జులై 16న రూ.2,000 కోట్లు..
జులై 16న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 2,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున రెండు బాండ్లు) అప్పునకు ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే రెండు సెక్యూరిటీ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 16 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 19 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
జులై 30న రూ. 3,000 కోట్లు..
జులై 30న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 3,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 15 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 25 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
ఆగ‌స్టు 27న రూ. 3,000 కోట్లు..
ఆగ‌స్టు 27న నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 3,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పునకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 12 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 17 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 22 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
అక్టోబ‌ర్ 1న రూ.3,000 కోట్లు..
అక్టోబ‌ర్ 1న‌ నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 3,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 14 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 20 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 24 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.
అక్టోబ‌ర్ 29న రూ.3,000 కోట్లు..
అక్టోబ‌ర్ 29న‌ నిర్వ‌హించిన‌ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో.. రూ. 3,000 కోట్ల (ఒక్కొక్క‌టి రూ.1,000 కోట్లు చొప్పున మూడు బాండ్లు) అప్పునకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మొద‌టి రూ.1,000 కోట్ల‌ బాండు 15 ఏళ్లు, రెండో రూ.1,000 కోట్ల బాండు 19 ఏళ్లు, మూడో రూ.1,000 కోట్ల బాండు 23 ఏళ్ల‌ కాల పరిమితి ఉంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్