కాంగ్రెస్ లో 5 గురు షిండేలు ఉన్నారు !

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో 5 గురు షిండేలు ఉన్నారని..త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సిఎం చెబుతున్నారన్నారు.

చిట్ చాట్ లో భాగంగా బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు..ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని రేవంత్ అంటున్నారని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఒక IPS అధికారి గుండెపోటుతో మరణించారని బాంబ్‌ పేల్చారు. భట్టి విక్రమార్క మీద కాంగ్రెస్ లో కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేశారు. యాదగిరి గుట్టలో కింద కూర్చోబెట్టారు.. ఆయన డ్రైవర్ ను కొట్టారు…..సెకండ్ పోజిషన్ నుంచి భట్టి విక్రమార్క ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular