- Advertisement -
తెలంగాణ జనాభాలో 55 శాతం బీసీలే.. కులగణన సర్వేలో వెల్లడి..!!
55 percent of Telangana's population is BC.. Caste census survey revealed..!!
ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు కలిపి 45 శాతం
సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం
హైదరాబాద్ జనవరి 4
రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది.ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున.. ఇప్పటికే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో వివరాలు, వినతులు తీసుకున్నది. సమగ్ర కులగణన సర్వేకు సంబంధించిన వివరాలు కూడా కమిషన్ కు అందాయి. కాగా, పోయినేడాది నవంబర్లో ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెలన్నర పాటు 90వేల మందికి పైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఆ వివరాల డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. కులగణన సర్వే రిపోర్టును ప్రణాళిక సంఘం దాదాపు సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా మొత్తం కోటి 17లక్షల 47వేల ఇండ్లకు స్టిక్కరింగ్చేయగా, ఇందులో 98 శాతం మేర వివరాలు సేకరించారు. ఇందులో 55 శాతం మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. మిగతా 45 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఇతరులు ఉన్నట్టు సమాచారం. ఇక కులగణన సర్వేకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన పూర్తిస్థాయి రిపోర్టును త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది.
- Advertisement -