మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం6 మంది దుర్మరణం,

- Advertisement -
6 people died in a fatal road accident at Balanagar.
6 people died in a fatal road accident at Balanagar.
6 people died in a fatal road accident at Balanagar.

వాయిస్ టుడే మహబూబ్ నగర్ జిల్లా

బాల్ నగర్ మండల కేంద్రంలో ఎన్ హెచ్ 47 శుక్రవారం సంత దినం కావడంతో భారీ రోడ్డు ప్రమాదం
ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం మృతులు మోతి ఘనాపూర్, గంగాధర్ పల్లి వాసులు వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్ పై వెళ్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకోవడం బాధాకరం.సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్, గంగాధర్ పల్లి గ్రామానికి చెందిన వారని స్థానికులు చెప్పారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు.
డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular