- Advertisement -
గజానికి 81 వేలు,…
81 thousand per yard,...
హైదరాబాద్, డిసెంబర్ 23, (వాయిస్ టుడే)
నగరంలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. మెట్రో మార్గాలను నిర్ణయించగా, అక్కడ సేకరించనున్న ఆస్తులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో మార్గంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్న ఆస్తులకు చెల్లించాల్సిన పరిహారంపై హైదరాబాద్ కలెక్టర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో.. మెట్రో మార్గంలో నిర్మాణాలకు మరో ముందడుగు పడినట్లు అయ్యింది.ఓల్డ్ సిటీలో మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతం అయిందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హెచ్ ఏ ఎం ఎల్ అధికారులు ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారని తెలిపారు. తదనుగుణంగా.. సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి రూ.81,000/- గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారని ఎన్వీఎఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు.. ఆస్తులకు చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు.ఫేజ్-2లో భాగంగా.. కారిడార్ VI- ఎమ్ జీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 800 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని తెలిపిన అధికారులు.. వాటిని సేకరించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. సంబంధిత ఆస్తుల యజమానులతో చర్చలు జరిపి ఒక చదరపు గజానికి రు.81,000/- మేర చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే.. చాలా మంది ఈ ఒప్పందానికి అంగీకరించారని తెలిపిన అధికారులు.. వారంతా మెట్రో భవన్, రసూల్ పురా, బేగంపేట్ లోని కార్యాలయాలకు వెళ్లి అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. యజమానుల అంగీకారం తర్వాత పదిరోజుల్లోనే నష్టపరిహారాన్ని చెక్కు రూపంలో అందిస్తామని తెలిపారు.మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరలో తమ అంగీకార పత్రాలను HAML కార్యాలయానికి అందజేస్తే వారికి కూడా నష్టపరిహారాన్ని చెక్కుల ద్వారా చెల్లిస్తామని ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని ధృడ నిశ్చయంతో ఉన్నారని అందుకు అనుగుణంగా పాత నగరంలో భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌తో.. రాపిడో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ముఖ్యమైన చొరవ అని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ప్రయాణీకులను తమ గమ్యాలకు చేర్చే రాపిడో లాంటి వాహన సేవలు మహిళలకు కూడా తగు ప్రాధాన్యత కల్పించి, వారిని కూడా పైలట్ లుగా భాగస్వామ్యులయ్యేలా కృషి చేయాలని సూచించారు. దీని వల్ల మహిళలలో భద్రత భావం పెరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
- Advertisement -