బటన్ నొక్కి న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి
ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోండి
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
నంద్యాల: కొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించి యువ న్యాయవాదులు వారి వృత్తిలో స్థిరపడే వరకు జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహిస్తూ ‘వైఎస్సార్ లా నేస్తం’ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్ లా నేస్తం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు

నెలకు 5 వేలు రూపాయలు చొప్పున 2023-24 సంవత్సరానికి రెండవ విడత ఆర్థిక సాయంగా జూలై 2023 నుండి డిసెంబరు 2023 ఆరు నెలలకు గాను రూ.30 వేలు చొప్పున రూ.7.98
కోట్లు వారి ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నగదు జమ చేసే కారక్రమాన్ని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, మైనారిటీ
సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మార్క్ఫెడ్ చైర్మన్ పి..పి.నాగిరెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు తోగూరు ఆర్థర్, ఏపిఎస్పీడిసిఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి జూనియర్ అడ్వకేట్ లు తదితరులు
వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ వైయస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు 7.98 కోట్ల
ఆర్థిక సహాయం ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వృత్తిపరంగా యువ న్యాయవాదుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వైఎస్సార్ లా
నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 98 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు రు. 5 వేల చొప్పున 29.40 లక్షల రూపాయల ఆర్థిక సహాయ పంపిణీని నేరుగా వారి
ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని యువ న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి
18 మంది లాయర్లకు రూ.5.40 లక్షలు, బనగానపల్లె నియోజకవర్గంలో 18 మందికి రూ.5.40 లక్షలు, డోన్ నియోజకవర్గంలో 15 మందికి రూ.4.50 లక్షలు, నందికొట్కూరు
నియోజకవర్గంలో ఇద్దరికి రూ.60,000 లు, నంద్యాల నియోజకవర్గంలో 37 మందికి రూ.11.10 లక్షలు, పాణ్యం నియోజకవర్గంలో ఒకరికి రూ.30,000 లు, శ్రీశైల నియోజకవర్గంలో 7
మందికి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 98 మంది యువ లాయర్ల కు రూ.29.40 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు
*అనంతరం లబ్ది పొందిన యువ లాయర్ల కు
29.40 లక్షల విలువ గల చెక్కును అతిథులు అందచేశారు.



