బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసీఆర్ కుట్ర: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ఉత్తర భారతదేశం నుంచి రాజకీయ చెంచాలను అరువు తెచ్చుకుంటున్నారని విమర్శ
తెలంగాణలో బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కల్వకుంట్ల కుటుంబం ఉత్తర భారతదేశం నుంచి కొందరు రాజకీయ చెంచాలను రాష్ట్రానికి అరువు తెచ్చుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. దేవరకొండలో జరిగిన మహిళా రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కొంతమంది చెంచాలలాగా అమ్ముడు పోయేది లేదన్న ఆయన.. బహుజన ఉద్యమాన్ని అమ్మేది కూడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ ను బహుజనులపరం చేయడమే తమ పార్టీ ఏకైక లక్ష్యమని అన్నారు. 99 శాతం జనాభా ఉన్న మాకు సంపదలో కూడా 99 శాతం వాటా కావాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 29 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. మహిళలపై ఘోరంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.