కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్: నగరంలోని గిరిరాజ్ కాలేజి మైదానలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 3 న ప్రధాని మోడీ పర్యటన వుంటుంది. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు వర్చువల్ గా ప్రారంభోత్సవం చేస్తారు. లక్ష మందితో సభ నిర్వహిస్తాం. ఉత్తర తెలంగాణలో బీజేపీది కీలక పాత్ర. ఖమ్మం లో కూడా పార్టీ బలపడింది. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా వుండబోతోంది. మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల ప్రచారం చేస్తాం. హామీ లపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం మాకు లేదు. కేటీఆర్ షాడో సీఎం. తెలంగాణ కేటీఆర్ జాగీరా. 17 సార్లు నోటిఫిసెషన్ ఇచ్చిఉద్యోగాలు ఇవ్వక పోవడం సిగ్గుచేటు. వాళ్ళ ఎజెండాలో మేము పడబోము. ఎమ్మెల్సీల పై గవర్నర్ నిర్ణయం సరైనదే. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.



