Wednesday, April 22, 2026

ముదురుతున్న కావేరి వివాదం?కర్ణాటకలో కొనసాగుతున్న టెన్షన్…!

- Advertisement -

ముదురుతున్న కావేరి వివాదం

బెంగళూరు, సెప్టెంబర్ 29:  కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం మరింత ముదురుతోంది. తమిళనాడుకి నీళ్లు ఇచ్చేదే లేదని పట్టుబడుతోంది కర్ణాటక. రాష్ట్ర అవసరాలు తీర్చుకోడానికే సరిపోవడం లేదని, వాటిని ఆ రాష్ట్రానికి విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆందోళనకారులంతా ఇవాళ (సెప్టెంబర్ 29) బంద్ ప్రకటించారు. తమిళనాడుకి కావేరీ నదీ జలాలు విడుదల చేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. కన్నడ సంస్థలకు చెందిన 50 మందికి పైగా ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు నడవడం లేదు. క్యాబ్‌లు, ఆటోలు తిరగడం లేదు. హోటల్స్‌, స్కూల్స్, కాలేజీలూ బంద్ అయ్యాయి. బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపు నిచ్చాయి కన్నడ సంస్థలు. ఇది దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, మాండ్య ప్రాంతాల్లో విద్యా సంస్థల్ని మూసివేశారు. బెంగళూరులో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. షాప్‌లు, మాల్స్‌తో పాటు మిగతా వాణిజ్య సంస్థలూ మూసేశారు. థియేటర్లూ బంద్ అయ్యాయి. పలు చోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. ఈ బంద్‌కి అనుమతి లేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ తేల్చి చెప్పారు. సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. అనవసరపు ఆందోళనలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరు మెట్రో సర్వీస్‌లపై ఈ బంద్ ప్రభావం కనపించ లేదు. రాష్ట్ర రవాణా సంస్థ బస్‌లు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడుతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీజలాల వివాదం కొనసాగుతోంది. 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకకు అదనంగా 14.75 TMCల నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు వాటాని అదే స్థాయిలో తగ్గించింది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక రీసోర్స్ ఈ కావేరి నదీ జలాలే. అంతే కాదు. కర్ణాటకలోని మాండ్యలో వ్యవసాయ భూములకూ ఈ నీరే ఆధారం. అయితే…దీనిపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఇది బయటపడింది. ఇక్కడ రాష్ట్రాల వాదన ఏంటంటే…2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్పనిసరే. కానీ…ఇది సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది వర్షపాతం 30% మేర తక్కువగా నమోదైంది. అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలంటే ఎలా అని కర్ణాటక వాదిస్తోంది. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.

Not enough for the needs of the state
Not enough for the needs of the state

కర్ణాటకలో కొనసాగుతున్న టెన్షన్

కావేరి జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ పలు సంస్థలు బంద్‌కి పిలుపునిచ్చాయి. ఆటోలు, ట్యాక్సీలు నడవడం లేదు. KSRTC బస్‌లు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన ప్రయాణికులకూ ఈ సమస్యలు తప్పడంలేదు. బంద్ కారణంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 ఫ్లైట్స్‌ రద్దయ్యాయి. కన్నడ సంస్థ ఒక్కుట పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఫ్లైట్ సర్వీస్‌లను రద్దుచేశారు.అయితే…ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం అందుకు వేరే కారణం చెబుతోంది. ఆపరేషనల్ రీజన్స్‌ వల్ల విమానాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ప్రయాణికులకు ఇదే సమాచారం అందించింది. కేవలం బంద్ కారణంగానే ఫ్లైట్‌లు రద్దయ్యాయని కొందరు వాదిస్తున్నారు. బంద్ వల్ల ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్లంతా టికెట్‌లు క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ వద్ద కూడా ఆందోళనకారులు అలజడి సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమిళనాడుకి కావేరి జలాలు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్ట్ వద్ద నిరసనలు చేపట్టిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురూ ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ కోసం టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. ఆసాకుతో లోపలికి వచ్చి ఆందోళన చేశారు. ఈ బంద్ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

కర్ణాటక ఆందోళనకారులంతా బంద్ ప్రకటించారు. తమిళనాడుకి కావేరీ నదీ జలాలు విడుదల చేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. కన్నడ సంస్థలకు చెందిన 50 మందికి పైగా ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లు నడవడం లేదు. క్యాబ్‌లు, ఆటోలు తిరగడం లేదు.హోటల్స్‌, స్కూల్స్, కాలేజీలూ బంద్ అయ్యాయి. బెంగళూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చాయి కన్నడ సంస్థలు. ఇది దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, మాండ్య ప్రాంతాల్లో విద్యా సంస్థల్ని మూసివేశారు. బెంగళూరులో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. షాప్‌లు, మాల్స్‌తో పాటు మిగతా వాణిజ్య సంస్థలూ మూసేశారు. థియేటర్లూ బంద్ అయ్యాయి. పలు చోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్