కాపులను అన్ని రంగాల్లో ముందుంచాను
మరో సారి అశీర్వదించండి
ఆగ్రోస్ భవన స్థలంలో కాంగ్రెస్ వాల్లు మల్లీఫ్లెక్సు కట్టేందుకు ప్రయత్నించిండ్రు…
నేను అదే స్థలంలో మెడికల్ కళాశాలను పెట్టాను
ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్
జగిత్యాల: రాజకీయ జీవితంలో మున్నూరు కాపులు అందించిన అండదండలు మరువలేనివని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత -సురేష్ ఆద్వర్యంలో జగిత్యాల పట్టణ మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమ్మేళనానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ లో జగిత్యాలలో పిడికెడు మంది నాయకులు లేరని, ఆ సమయంలో మున్నూరుకాపులు తన వెంట ఉండి నడిచారని, 2014 లో ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ చాలా బూత్‌లలో అత్యధిక మెజార్టీ ఇచ్చారని, మున్నూరు కాపులు ఎక్కువగా ఉండే బూతులలో మెజార్టీ రావడంతో కాంగ్రెస్ నాయకులే అవాక్కయ్యారని, 218 బూత్ నంబరులో 95శాతం ఓట్లు తనకు పోలవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డే పరేషాన్ అయ్యాడన్నారు.
2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా, నియోజకవర్గం మొత్తంలో కాపులు నా వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.
వెన్నంటి ఉన్న కాపులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. దావ వసంతను జడ్పీటీసీగా గెలిపించి జడ్పీ చైర్ పర్సన్ ను చేశామని, ఇలా ఎంతో మంది కాపు బిడ్డలకు తగిన విధంగా న్యాయం చేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో కాపులే ఎక్కువ శాతం లబ్దిపొందుతున్నారన్నారు. 2014,2018లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చానన్నారు. వంద పడకల మాతా శిశు ఆసుపత్రి, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశానన్నారు. మెడికల్ కళాశాల స్థలం గురించి ఎంతో మంది రాజకీయం చేసి మోకాలడ్డే ప్రయత్నం చేశారన్నారు. ఎక్కడెక్కడి నుంచో వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఎస్సారెస్పీ భూముల్లో కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఆగ్రోస్ స్థలంలో కాంగ్రెస్ నాయకులు మల్టీఫ్లెక్స్‍లు కట్టేందుకు ప్రయత్నాలు చేశారని కాని ప్రజావసరాల కోసం నేను ఈ భూముల్లో మెడికల్ కళాశాలను నిర్మించానన్నారు. కమిట్‌మెంట్ అంటే ఇదీ అన్నారు. జిల్లా కేంద్రం అయినందున విద్యార్థులకు వసతి సౌకర్యం, కమ్యూనిటీ భవనాల కోసం స్థలాల సేకరణకు ప్రయత్నిస్తుంటే కొందరు నాయకులు గ్రామ ప్రజలను రెచ్చగొడుతున్నారని, కమ్యునిటీ భవనాలకు, విద్యార్థుల వసతికి భూములు వద్దని సదరు నాయకుడు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకర్గంలో 40 గ్రామాల్లో రూ.1.40 కోట్లతో కమ్యునిటీ భవనాలు మంజూరు చేశానన్నారు. నియోజకవర్గ ప్రజలే నా వారసులని, అహర్నిషలు నియోజకవర్గ అభివృద్ది కోసం పాటుపడే తనకు మరో సారి అవకాశం ఇవ్వాలన్నారు. 2014,2018లో నా వెంట ఉన్నరు…2023లో కూడా వెన్నంటి ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్‌ఎస్ పథకాలతో మున్నూరు కాపులకే ఎక్కువ లబ్ది
జడ్పీ చేర్‌పర్సన్ దావ వసంత.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, 24 గంటల నిరంతర విద్యుత్ వంటి పథకాలతో మున్నూరు కాపులే ఎక్కువగా లబ్ది పొందుతున్నారని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. తెలంగాణ రాక పూర్వం సాగు నీరు లేక, కరంటు రాక పంట భూములన్నీ పడావులుగా మారాయని, కాపుల ఇండ్లకు పిల్లనిచ్చేందుకు వెనుకాడేవారని, కాని 2014 తర్వాత సీన్ మొత్తం మారిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మించి, చెరువులు తవ్వించడంతో చెరువులు, బావుల్లో నీరు పుష్కలంగా చేరిందని, వ్యవసాయానికి నిరంతరంగా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటం, పంట సాయం కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తుండటంతో నేడు ప్రతీ ఎకరా పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు. బీఆర్‌ఎస్ కే ఓటేస్తామని తీర్మాణం జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించిన మున్నూరు కాపులు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి డా. సంజయ్‌కుమార్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తీర్మాణం చేశారు.