
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో గనుల శాఖ అధికారిణా దారు ణ హత్య కలకలం రేపింది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీసుస్టేషన్ పరిధిలోని దొడ్డకల్లసంద్ర గోకుల అపార్టుమెంట్‌లోని నివాసంలోనే గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ హత్యకు గురయ్యారు. భర్త, కుమారుడు తీర్థహళ్లిలోనే నివసిస్తుండగా ఆమె ఒక్కరే బెంగళూరులో ఉంటున్నారు. రాత్రి 8 గంటలకు కారు డ్రైవర్ అపార్ట్‌మెంట్‌లో ప్రతిమను వదిలివెళ్లాడు. ఆ తర్వాత హంతకులు దారుణానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉండగా రాత్రి పలుమార్లు ఫోన్ చేసినా తీయలేదని, ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అపార్ట్‌మెంట్‌లోని వారికి చెప్పగా వారు పరిశీలిస్తే హత్య విషయం తెలిసిందన్నారు. బెంగళూరు నగర జిల్లా హుణసేమారేనహళ్లి గ్రామంలో అనుమతుల్లేని గనుల తవ్వకాలను ఆమె నిలిపివేసినట్టు తెలుస్తోంది. క్వారీలు నిలిపివేసినందుకే హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. గనులశాఖ అధికారిణి హత్యపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు సీఎం సిద్దరామయ్య తెలిపారు.



