Wednesday, January 28, 2026

ఫామ్ హౌస్  కోసం కాళేశ్వరం

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే ): సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడని తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్‌కే వస్తున్నాయన్నారు. దళితులని సీఎం చేస్తానని దళితులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. భద్రాద్రి రాములోరి కల్యాణానికి కేసీఆర్ రారు.. మజ్లీస్ దావత్ లకు మాత్రం వెళ్తారన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల జనాలు, అమరవీరులు వదిలిన బాణం ఈటల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలవడని, ఈటల రాజేందర్ గజ్వేల్ కి రాగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండన్నారు కిషన్‌ రెడ్డి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఒడిపోతాడన్నారు.ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని.. భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అవినీతిమయం అయిందని, కల్వకుంట్ల కుటుంబంపాలైందని ఆరోపించారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్‌లోకి పోయారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్లో పెట్టుకోబోదని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు.

kaleswaram-for-farm-house
kaleswaram-for-farm-house

విజయానికి సంకేతం…

కరీంనగర్ అసెంబ్లీ ‌పరిధిలో‌ అంబేద్కర్‌ నగర్ నుంచి కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి‌ సంజయ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. 30 తేదిన విజయానికి సంకేతమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బీజేపీ గెలుస్తదని డిసైడ్ చేసాడన్నారు. బండి‌సంజయ్ భూదందాలు చేయలేదని, ఖబ్జా లు చేయలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కి‌ నిధులు తీసుకువచ్చింది ఎవరు,అభివృద్ధి అడ్డం‌ పడ్డది ఎవరూ అని ఆయన ప్రశ్నించారు. బండి‌సంజయ్ ని‌ అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కోట్లు కరీంనగర్ కి పంపుతున్నారని, కరీంనగర్ బండి‌సంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారన్నారు.అంతేకాకుండా.. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు. కేటీఆర్ వి అహంకారం అహంకారం మాటలు. బీఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్‌ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు. టీఎస్పీపీఎస్సీ సమస్య చిన్నది అని‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి. నిరుద్యోగ సమస్యల కొసం బీజేపీ పొరాటం చేస్తే జైలుకు పంపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి చేతులు కలపాలి. నరేంద్ర మోడీ బీసీ అత్మగౌరవ సభకి వస్తున్నారు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కేసీఆర్‌కి బీసీ ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా. బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు. కేసీఆర్ కుటుంబం అహంకారానికి,తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం. కేసీఆర్ రాజ్యాంగం కావాలా…అంబేద్కర్ రాజ్యాంగం కావాలా.. తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు. ఒకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివేయకండి…. గెలిపించండి’ ‘ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్