మునుగోడులో కాంగ్రెస్ కు  షాక్

- Advertisement -
A shock to the Congress earlier
A shock to the Congress earlier

కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై
గులాబీ గూటికని ప్రకటన ..!

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.  దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి  పోటీ చేసిన విషయం తెలిసిందే . మునుగోడులో రాజకీయాలలో కీలక  పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలె బీజేపీ వీడి కాంగ్రెస్ చేరిన కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ అశించిన చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీ వీడటంతో కార్యకర్తల్లో అయోమయంలో పడ్డారు. గందరగోళ పరిస్థితి నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular